: ఈజిప్ట్ మాజీ అద్యక్షుడు మోర్సీకి మరణశిక్ష... వంద మంది అనుచరులకు కూడా!
ఈజిప్ట్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అద్యక్షుడు, 2013లో పదవి కోల్పోయిన మహ్మద్ మోర్సీకి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. 2011లో దేశంలో చెలరేగిన అల్లర్ల సమయంలో తన అనుచరులతో కలిసి జైలు గోడలు బద్దలు కొట్టిన ఘటనలో మోర్సీపై కేసు నమోదైంది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ఈజిప్ట్ కోర్టు కొద్దిసేపటి క్రితం ఆయనతో పాటు ఆయన అనుచరగణంలోని వంద మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2013లో మోర్సీ పాలనపై దేశంలో తీవ్ర స్థాయిలో నిరసన పెల్లుబికింది. దీంతో సైన్యం తిరుగుబాటు చేసి మోర్సీని పదవీచ్యుతుడిని చేసింది. అధికారంలో ఉండగా, నిరసనకారులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టాలన్న ఆయన ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఇప్పటికే ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.