: వచ్చేసింది 4జి... సేవలు ప్రారంభించిన ఎయిర్ టెల్
టెలికం సేవల్లో అగ్రగామిగా వున్న ఎయిర్ టెల్ నేడు 4జి సేవలను ముంబైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. శాంసంగ్, జియోమీ, మోటరోలా, లెనోవో, ఆసూస్, హ్యూయ్ తదితర సంస్థలతో డీల్స్ కుదుర్చుకుని, 4జి టెక్నాలజీకి సహకరించే వివిధ రకాల ఉత్పత్తులను ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించాలని ఎయిర్ టెల్ నిర్ణయించుకుంది. ఇప్పటికే సంస్థ నుంచి 3జి సేవలను పొందుతున్న వారికి అవే ధరలపై 4జి సేవలను అందిస్తామని, కొత్త కస్టమర్ల కోసం బండిల్డ్ ఆఫర్లు సిద్ధం చేశామని సంస్థ మహారాష్ట్ర, ముంబై సర్కిళ్ల సీఈఓ అశోక్ గణపతి తెలియజేశారు. తొలుత 4జి సేవల నాణ్యతపై కస్టమర్ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని, తరువాత పూర్తి స్థాయిలో విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఎయిర్ టెల్ 4జి మార్కెట్ల కోసం ప్రత్యేకంగా 4జి స్మార్ట్ ఫోన్ ను అందుబాటు ధరలో విడుదల చేయనున్నట్టు శాంసంగ్ వివరించింది.