: ముంబైలో పోలీస్ స్టేషన్ ఎదుటే ‘హిట్ అండ్ రన్’... టీసీఎస్ మహిళా టెక్కీ దుర్మరణం


పదమూడేళ్ల నాడు బాలీవుడ్ కండలవీరుడు మద్యం మత్తులో జనంపైకి కారు ఎక్కించిన కేసులో ఎట్టకేలకు దోషిగా తేలాడు. అయితే వెనువెంటనే అతడికి బెయిల్ కూడా మంజూరైంది. నాటి ఘటనను మరిపించేలా బుధవారం రాత్రి ముంబై మహా నగరంలో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని గోర్ గావ్ ప్రాంతంలోని వన్రాయ్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన ఈ ఘటనలో టాటా కన్సల్టెన్సీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతి అర్చనా పాండ్య(22) దుర్మరణం పాలైంది. అంధేరీలో నివసిస్తున్న అర్చన బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టింది. అంతేకాక నాడు సల్మాన్ లాగానే నేడు కూడా నిందితులు ప్రమాదం జరిగిన వెంటనే పత్తా లేకుండా పారిపోయారు. తీరా స్థానికులు గుర్తించేలోగానే ఆమె మృత్యువాత పడింది.

  • Loading...

More Telugu News