: ఔషధ సంస్థ గ్లెన్ మార్క్ పై సుప్రీంకోర్టు నిషేధం


మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం గ్లెన్ మార్క్ విక్రయిస్తున్న జానూవియా, జానూమెట్ ఔషధాలను విక్రయించకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అమెరికన్ సంస్థ మెర్క్ తయారు చేసిన ఈ ఔషధాల జనరిక్ వర్షన్ ను గ్లెన్ మార్క్ తయారు చేసి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. వీటి తయారీని కూడా నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. ఇదే సమయంలో గ్లెన్ మార్క్ ఇతర ఔషధాలను విక్రయించుకోవచ్చని తెలిపింది. 2013లో మెర్క్ వేసిన కేసును విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న డ్రగ్స్ గా డయాబెటిక్ విభాగం ఔషధాలు నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగగా 6.5 కోట్ల మంది మధుమేహ వ్యాధి గ్రస్తులున్నారని అంచనా వేస్తుండగా, ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లను అధిగమిస్తుందని అంచనా.

  • Loading...

More Telugu News