: రాహుల్ అమాయకుడు... ఇక్కడికి పిలిచి అవమానించారు: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన తుమ్మల


అమాయకుడైన రాహుల్ గాంధీని తెలంగాణకు పిలిచి, కాంగ్రెస్ నేతలు అవమానించారని తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పర్యటనకు ముందు రాహుల్ కు కనీస సమాచారం ఇవ్వలేదని, కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకే ఆర్థిక సాయం చేశారని విమర్శించారు. రైతు భరోసా యాత్రలా కాకుండా, కాంగ్రెస్ 'మేలుకొలుపు' యాత్ర జరిపించారని ఎద్దేవా చేశారు. మరో నాలుగేళ్ల తర్వాత రైతు ఆత్మహత్యలు జరిగితేనే టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తుమ్మల అన్నారు.

  • Loading...

More Telugu News