: ఆగస్టులో నా 150వ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది: కడపలో మెగాస్టార్ చిరంజీవి ప్రకటన


కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమాకు సంబంధించి కొద్దిసేపటి క్రితం విస్పష్ట ప్రకటన చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుందని ఆయన స్వయంగా ప్రకటించారు. నేడు కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. సదరు చిత్రం నిర్మాణ బాధ్యతలు తన కొడుకు రామ్ చరణ్ తేజతో పాటు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ లు పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత చిరంజీవి సిల్వర్ స్ర్రీన్ పై మెరవనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ తేజ ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సదరు చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారు.

  • Loading...

More Telugu News