: నిండు చంద్రుడు ఒకవైపు... చుక్కలు ఒకవైపు: మోదీ


చైనా, భారత్ లు నిండు చంద్రుడిలా ఒకవైపు నిలిస్తే, మిగిలిన దేశాలన్నీ చుక్కల్లా మరోవైపు ఉన్నాయని ప్రధాని మోదీ అభివర్ణించారు. షాంగైలో వేలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు చూస్తున్నాయని ప్రస్తావించిన ఆయన, చైనా, ఇండియాలు కలిస్తే తిరుగులేని శక్తిగా మారుతాయని అన్నారు. అభిప్రాయ భేదాలు సర్వసాధారణమని, ఒక ఇంట్లోని అన్నదమ్ముల మధ్యే ఆలోచనల తేడాలుంటాయని అన్న ఆయన, సమీప భవిష్యత్తులో రెండు దేశాలూ ఎన్నో అంశాల్లో పరస్పరమూ సహాయ సహకారాలు అందించుకోనున్నాయని అన్నారు. మనమంతా కలిస్తే ఇండియాను అతి త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా చూసుకోవచ్చని చైనా ఎన్నారైలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'రేపు ఆదివారం మీకందరికీ సెలవు' అని గుర్తు చేసిన మోదీ, తాను మాత్రం మంగోలియా వెళ్లి పార్లమెంటులో ప్రసంగించనున్నానని, గత సంవత్సర కాలంగా ఒక్క తప్పు కూడా జరగకుండా పాలన సాగిస్తున్నానని తెలిపారు. చైనా పర్యటనలో తనకు లభించిన ఆదరణ మరువలేనని అన్నారు.

  • Loading...

More Telugu News