: నన్ను దత్తత తీసుకుంటామంటున్నారు: దీపికా పదుకునే
'పీకూ' సినిమా విడుదలైన తరువాత తనను దత్తత తీసుకుంటామంటూ ఫోన్లు చేస్తున్నారని బాలీవుడ్ నటి దీపికా పదుకునే తెలిపింది. 'పీకూ' సక్సెస్ ఆనందంలో ఉన్న దీపిక, ఆ సినిమాలో పోషించిన పాత్ర జనాల్లోకి బాగా వెళ్లిందని తెలిపింది. ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే పాత్రలో ఒదిగిపోయానని చెప్పింది. తండ్రీ కూతుళ్ల మధ్య సంభాషణలు సహజంగా ఉండడంతో సినిమాకు ఆదరణ పెరిగిందని ఆమె తెలిపింది. 'పీకూ' విడుదల తరువాత చాలా మంది తనను దత్తత తీసుకోవాలని కోరడం ఫన్నీగా ఉందని దీపికా పేర్కొంది. తన సినిమాలకు తన కుటుంబ సభ్యులే తొలి విమర్శకులని దీపికా పదుకునే చెప్పింది.