: ఆరవ రోజుకు చేరిన జగన్ భరోసా యాత్ర


రైతుల్లో భరోసా కల్పించేందుకు వైకాపా అధినేత జగన్ భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఆయన పర్యటన ఆరవ రోజుకు చేరుకుంది. ఈనాటి ఆయన యాత్ర ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. ఉరవకొండ నుంచి ప్రారంభమయ్యే ఈనాటి యాత్ర కనేకల్ వరకు కొనసాగుతుంది. కనేకల్ లో అప్పుల బాధ తట్టుకోలేక బలన్మరణానికి పాల్పడ్డ రైతు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. జగన్ యాత్రకు మద్దతుగా భారీగా వైకాపా కార్యకర్తలు తమ నేతతో కలసి నడుస్తున్నారు.

  • Loading...

More Telugu News