: రెవెన్యూ అధికారులతో గ్రామస్థుల ఘర్షణ
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగలూరులో పోలవరం నిర్వాసితులు, రెవెన్యూ అధికారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అంగలూరులో ఇళ్ల కూల్చివేతకు వెళ్లిన రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ముందు పరిహారం చెల్లించాలని, ఆ తరువాతే ఇళ్ల కూల్చివేతకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ డిమాండ్ అసంబద్ధమైనది కాదని, తక్షణం అధికారులు వెనుదిరగాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. అయితే, అధికారులు ముందుకు సాగడంతో వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది.