: ఐఎస్ఐఎస్ కీలక విజయం... ఇరాక్ లోని రెమదై నగరం కైవసం!
ఇరాక్ లోని రెమదై పట్టణాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నట్టు ఐఎస్ఐఎస్ ప్రకటించింది. స్థానిక ప్రభుత్వ కార్యాలయ భవనంపై ఐఎస్ఐఎస్ జెండాను ఎగురవేసి అక్కడి మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల ద్వారా ఉగ్రవాదులు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. ఇరాక్ పడమర ప్రాంతానికి రాజధానిగా ఉన్న రెమదై నగరం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం వారి ప్రాబల్యం మరింతగా విస్తరిస్తుందనడానికి నిదర్శనం. గత సంవత్సరం నుంచి పారామిలటరీ దళాలు ఉగ్రవాదులను తరిమికొట్టడానికి ప్రయత్నిస్తుంటే, వారు ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ వెళ్తుండడం ప్రమాద భయాన్ని పెంచుతోందని, రెమదై నగరంలో పరిస్థితి విషమించినప్పటికీ, వారి చేతుల్లోకి పూర్తిగా వెళ్లలేదని అన్బర్ గవర్నర్ సొహాయిబ్ అల్ రావి తెలిపారు. ఉగ్రవాదులను అడ్డుకునేందుకు సైన్యం పోరు సాగిస్తూనే ఉందని వివరించారు.