: 'గే' ప్రధాని పెళ్లి ఘనంగా జరిగింది


లక్సెంబర్గ్ ప్రధాని జేవియర్ బిటెల్ (42) 'గే' (స్వలింగ) వివాహం ఘనంగా జరిగింది. గతరాత్రి పొద్దుపోయాక లక్సెంబర్గ్ టౌన్ హాల్ లో సహచరుడు, ఆర్కిటెక్ట్ అయిన గౌతియర్ డెస్టెనేను ప్రధాని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. 28 దేశాల యూరోపియన్ యూనియన్ లో స్వలింగ వివాహం చేసుకున్న తొలి ప్రధాని బిటెల్ కావడం విశేషం. ఈ వివాహమహోత్సవానికి బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్, మరో 500 మంది అతిథులు హాజరయ్యారు. 2010లో ఐస్ లాండ్ ప్రధాని జోహనా సిగుర్డార్డోటిర్ కూడా తన సహచరణిని పెళ్లాడింది. అది 'లెస్బియన్' వివాహం కాగా, ఇది 'గే' వివాహం. 2010 నుంచి గోతియర్ తో జేవియర్ బిటెల్ సహజీవనం చేస్తున్నారు. కాగా, 2013 డిసెంబర్ లో ఆయన లక్సెంబర్గ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News