: గంటల వ్యవధిలో 5 లక్షల 'లైక్'లు... ఈ శతాబ్దపు అత్యంత శక్తిమంతమైన సెల్ఫీ ఇదేనట!


ఈ సెల్ఫీని ఈ శతాబ్దపు అత్యంత శక్తిమంతమైనదిగా ఫోర్బ్స్ పత్రిక అభివర్ణించింది. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా తదితర ఎన్నో దేశాల ప్రధానులు ఈ ఫొటోను లైక్ చేశారు. అదే చైనా ప్రధాని లీ కెక్వియాంగ్ తో కలసి ప్రధాని మోదీ తన స్మార్ట్ ఫోన్ కెమెరాతో 'క్లిక్' మనిపించిన ఫొటో. పోస్ట్ చేసిన తరువాత గంటల వ్యవధిలో ఈ ఫొటోకు 5 లక్షల 'లైక్'లు వచ్చాయి. ప్రధాని మోదీ ఈ చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'ఇట్స్ సెల్ఫీ టైం! థ్యాంక్యూ ప్రీమియర్ లీ' అంటూ క్యాప్షన్ పెట్టారు. బీజింగ్ లోని టెంపుల్ ఆఫ్ హెవెన్ ముందు ఇద్దరు ప్రధానులు ఈ చిత్రాన్ని దిగారు. ఈ చిత్రాన్ని చూసిన చైనీయులు ముగ్ధులవుతున్నారట. కొందరు 'క్యూట్ ప్రీమియర్' అని అంటే, మరికొందరు 'మా ప్రధాని ఇంకా సామాజిక మాధ్యమంలో లేరేంటి?' అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

  • Loading...

More Telugu News