: ఒంగోలులో రోడ్లపై 'లయన్' పైరసీ సీడీలు!
బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'లయన్' సినిమా పైరసీ సీడీలు ఒంగోలులో రోడ్లపై కుప్పలుగా అమ్మకానికి పోశారు. సినిమా రిలీజైన ఒక్కరోజులోనే పైరసీ సీడీ, డీవీడీలు వచ్చేశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఒంగోలులోని అన్ని సీడీ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లయన్ సినిమా పైరసీ సీడీలు పెద్దఎత్తున దొరికినట్టు సమాచారం. సీడీ షాపుల యజమానులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కోట్లాది రూపాయలు వెచ్చించి తీసే చిత్రాలను పైరసీ చేస్తూ, సినీ పరిశ్రమకు నష్టాలను తీసుకువస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్రసీమ పెద్దలు చానాళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.