: మీ డాక్టర్ చేయిపట్టి 'బీపీ'ని చెక్ చేస్తున్నారా? అయితే అది తప్పట!
బీపీ (రక్తపోటు) చెక్ చేసేటప్పుడు సాధారణంగా డాక్టర్ మన చేతికి బీపీ పరికరాన్ని తగిలించి చూస్తుంటాడు. అయితే, ఇది సరైన పద్ధతి కాదని హైదరాబాదులోని ఆపోలో ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. గుండెలో కూడా బీపీ ఉంటుందని, అది వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఉంటుందని అపోలో వైద్యులు వెల్లడించారు. దానిని పరీక్షిస్తేనే అసలు బీపీ తెలుస్తుందని కూడా చెప్పారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా బీపీ బాధితుల సంఖ్య పెరిగిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక బరువుతో పుట్టే పిల్లలకు బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువని వారు తెలిపారు. గుండె జబ్బులు కూడా బీపీ పెరగడం వల్లే వస్తున్నాయని వారు సూత్రీకరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పదేళ్ల ముందే యువతకు బీపీ వస్తోందని వారు చెప్పారు.