: యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా


యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2015కు సంబంధించిన నోటిఫికేషన్ మే 16న విడుదల కావాల్సి ఉండగా, నోటిఫికేషన్ తేదీ త్వరలో ప్రకటిస్తామని కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. పరీక్షల విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్పుల నేపథ్యంలో నోటిఫికేషన్ వాయిదా వేసినట్టు సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఆప్టిట్యూడ్ టెస్ట్ కొనసాగించాలని, కనీస అర్హత మార్కులుగా 33 శాతం రావాలని కేంద్రం నిర్దేశించిన సంగతి తెలిసిందే. అలాగే 2011లో ప్రిలిమ్స్ లో పోటీ పడిన అభ్యర్థులను కూడా ఈ ఏడాది పరీక్ష రాసేందుకు అనుమతిచ్చింది.

  • Loading...

More Telugu News