: హైదరాబాదుతో చైనా నగరానికి వర్తకం... మోదీ ఒప్పందం
ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో హైదరాబాదు నగరానికి ప్రాధాన్యత ఇచ్చారు. చైనా పర్యటన సందర్భంగా ఆ దేశంతో మోదీ 24 ఒప్పందాలు చేసుకున్నారు. వాటిల్లో ఒకటి, చైనాలోని నాలుగు నగరాలను భారత్ లోని నాలుగు నగరాలతో అనుసంధానం చేస్తూ స్నేహపూర్వక వ్యాపారం నిర్వహించే ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా చైనాలోని కిందావ్ నగరంతో హైదరాబాదును అనుసంధానం చేశారు. ఈ రెండు నగరాల మధ్య స్నేహపూర్వక వర్తకం జరగనుంది. దీంతో, మోదీ చైనా పర్యటనతో హైదరాబాదుకు మేలు జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.