: భార్య చేతిలో 'చావు' తప్పించుకున్న భర్త!
నిద్రపోతున్న భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ శతవిధాల ప్రయత్నించింది. తమిళనాడులోని తిరుపూరులో వంజియమ్మాళ్, కన్నన్ భార్యాభర్తలు. భర్త కన్నన్ తో గొడవ జరగడంతో ఆగ్రహించిన వంజియమ్మాళ్ నిద్రపోతున్న భర్త కాళ్లు చేతులు కట్టేసింది. అనంతరం అతని ముఖానికి పాలిధీన్ కవర్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేయాలని ప్రయత్నించింది. ఊపిరి ఆడకపోవడంతో మేల్కొన్న కన్నన్, జరుగుతున్నది గ్రహించి అరవసాగాడు. అతని అరుపులకు మేల్కొన్న పిల్లలు భయంతో అరవడంతో, ఎలాగైనా భర్తను హతమార్చాలని భావించిన వంజియమ్మాళ్ కట్టెతో కొట్టింది. తరువాత కొడవలితో దాడి చేసింది. పిల్లల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని, అతనిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. వంజియమ్మాళ్ పోలీసులకు లొంగిపోయి, భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక హత్య చేయాలని ప్రయత్నించానని వెల్లడించడం విశేషం.