: భూదాన్ ట్రస్టును రద్దు చేస్తూ జీవో
భూదాన్ ట్రస్టు బోర్డును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాంతో పాటు, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి భూదాన్ ట్రస్టు బోర్డు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, భూదాన్ ట్రస్టు బోర్డు చేసిన అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. భూదాన్ ట్రస్టుకు కేటాయించిన భూములను ఇంజనీరింగ్ కళాశాలలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ధారాదత్తం చేయడంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.