: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాదు
ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలవాలంటే గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ చేయనుంది. బౌలింగ్ ఆయుధంగా హైదరాబాదు జట్టు ఐపీఎల్ లో రాణిస్తుండగా, గేల్, డివిలియర్స్, కోహ్లీలతో బెంగళూరు బ్యాటింగ్ ఆయుధంగా బరిలో దిగనుంది. కాగా, ఉప్పల్ లో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.