: మే 21నే ఏపీ ఎంసెట్ ఫలితాలు


మే 8వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్ష ఫలితాలను అనుకున్న తేదీ కంటే ముందుగానే విడుదల చేస్తామని ఏపీ ఎంసెట్ కన్వీనర్ ఆచార్య సాయిబాబు ప్రకటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 21న ఏపీ ఎంసెట్ ఫలితాలు వెల్లడించనున్నామని అన్నారు. ఈ నెల 15 వరకు ప్రశ్నాపత్రాల్లో ఉన్న అభ్యంతరాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ప్రతి సబ్జెక్టుకు ఐదుగురు సభ్యుల బృందంతో వాటిని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. తుది 'కీ' తోపాటు ర్యాంకులను ఈ నెల 21న విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News