: అక్కడి మెనూలో రెండు పదార్థాలే దర్శనమిస్తాయి!
సాధారణంగా ఏదయినా రెస్టారెంట్ కు వెళ్తే ముందుగా చూసేది మెనూనే. అందులో వెరైటీలు ఏమున్నాయి, అక్కడి స్పెషల్ ఏంటి? అనేది భోజన ప్రియులు చూస్తారు. ఇలా కాకుండా మెనూలో కేవలం రెండే పదార్థాలు కనిపిస్తే కాస్త ఇబ్బందిగా వుంటుంది కదూ! బెంగళూరులోని 'డాజో' అనే ఫుడ్ డెలివరీ సిస్టమ్ మెనూలో అచ్చం అలాగే రెండు పదార్థాలే ఉంటాయి. 2014 అక్టోబర్ నుంచి అతి తక్కువ సిబ్బందితో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థను శశాంక్ సింఘాల్, మోనికా రస్తోగీ ప్రారంభించారు. కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు వీరు డెలివరీ చేస్తారు. వీరి మెనూలో కేవలం రెండు పదార్థాలే ఉంటాయి. ప్రతి రోజూ మెనూ మారినా అందులో కేవలం రెండు పదార్థాలే ఉండడం విశేషం. ఆకలితో ఉన్న వాళ్లను మెనూ పేరిట సందేహంలో పడేసే కంటే, అతి తక్కువ మెనూతో క్వాలిటీ భోజనం పెడితే బాగుంటుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. వీరు ఎవరికైతే ఫుడ్ సరఫరా చేశారో, వారే మళ్లీ మళ్లీ ఆర్డర్లు ఇవ్వడం విశేషం.