: 'కట్టప్ప'ను విడుదల చేసిన రాజమౌళి


రాజమౌళి 'బాహుబలి' సినిమాలో పాత్రలను పోస్టర్ల రూపంలో తెలుగు సినీ అభిమానులకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకో పోస్టర్ తో టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న రాజమౌళి నేడు 'కట్టప్ప'ను విడుదల చేశాడు. 'బాహుబలి' సినిమాలో 'కట్టప్ప' పాత్రను ప్రముఖ నటుడు సత్యరాజ్ పోషించారు. ఈ పోస్టర్ ను ట్విట్టర్లో రాజమౌళి విడుదల చేశారు. కాకలు తీరిన యుద్ధ వీరుడిగా కదనరంగంలో నిలబడిన 'కట్టప్ప' సినీ అభిమానులను తొలిచూపులోనే అలరిస్తున్నాడు. రెండు భాగాలుగా విడుదల చేయనున్న 'బాహుబలి' మొదటి భాగాన్ని 'ద బిగినింగ్'గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News