: 'మో సతి' మహిళా భద్రత యాప్


'మో సతి' పేరిట మహిళా భద్రతకు ఒడిశా ప్రభుత్వం ఓ యాప్ ను విడుదల చేసింది. భువనేశ్వర్, కటక్ నగరాల్లో మహిళా భద్రతకు ఈ యాప్ ను రూపొందించినట్టు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు ఈ యాప్ అంకితం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ టెక్నాలజీ సాయంతో మహిళలు రక్షణ పొందవచ్చని ఆయన చెప్పారు. ప్రభుత్వం మహిళల రక్షణ, గౌరవం కాపాడేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News