: బిగ్ బాష్ లీగ్ లో ఆడనున్న గేల్
ఐపీఎల్ లో పరుగుల వరదపారిస్తున్న వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఆస్ట్రేలియాలో జరిగే 'బిగ్ బాష్ సీజన్ 5'లో ఆడనున్నాడు. బీబీఎల్ సీజన్ 5లో మెల్ బోర్న్ రెనిగేడ్స్ తరపున ఆడేందుకు క్రిస్ గేల్ సంతకం చేశాడని రెనిగేడ్స్ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ తో కలిసి గేల్ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తారని రెనిగేడ్స్ వెల్లడించింది. 2015-16కు రెనిగేడ్స్ తరపున బిగ్ బాష్ లో ఆడేందుకు గేల్ ఒప్పందం చేసుకున్నట్టు ఆ ఫ్రాంఛైజీ వెల్లడించింది.