: నేపాల్ లో మళ్లీ భూకంపం... 3 అడుగులు కుంగిన హిమాలయాలు


గత నెలలో సంభవించిన భూకంపంలో నేపాల్ లో ఎనిమిది వేల మంది మృత్యువాత పడ్డారు. అలాగే, భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. అనంతరం సంభవించిన మరో భూకంపంలో వంద మందికి పైగా చనిపోయారు. తాజాగా ఈ రోజు మరో భూకంపం సంభవించింది. దీనీ తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయింది. భూకంప కేంద్రం ఖాట్మండూకు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్ జిల్లాలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే, ఈ భూకంపాల ధాటికి హిమాలయాల్లోని పలు ప్రాంతాలు 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు కుంగిపోయాయట. శాటిలైట్లు తీసిన ఇమేజెస్ లో ఈ విషయం స్పష్టమయింది.

  • Loading...

More Telugu News