: బైక్ ను ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు... ఒకరు మృతి
గోవా ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు బైక్ ను ఢీకొనడంతో దానిపై ఉన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఎమ్మెల్యే గోవా విమానాశ్రయం వైపు వెళుతుండగా కారుకు ఎదురుగా బైక్ వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్ దేశాయ్ కారులోనే ఉన్నారని... అయితే, ఆయన కారును నడపడం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.