: షర్టు లేకుండా వీడియోలో 'థ్యాంక్స్' చెప్పిన షారుఖ్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 13 మిలియన్లకు చేరిన సంగతి తెలిసిందే. దీంతో, షారుఖ్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియోలో షర్టు లేకుండా, కళ్లకు గ్లేర్స్ పెట్టుకుని కూల్ గా మాట్లాడాడు. మహిళలను దూషించవద్దని ఫ్యాన్స్ కు సూచించాడు. తన పట్ల వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక, తాను వీడియోలో డిఫరెంట్ గా కనిపించడంపైనా మాట్లాడాడు. "అయాం వేరింగ్ గ్లేర్స్, బట్, అయాం నాట్ వేరింగ్ షర్ట్" అంటూ ముగించాడు.