: ఇకపై రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉండదు


ఇకపై రైళ్లలో రాత్రిపూట సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ వంటివి ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటును పశ్చిమ మధ్య రైల్వే ఎత్తివేయనుంది. రైళ్లలో తరచు దొంగతనాలు జరగడం, షార్ట్ సర్క్యూట్ కావడం వంటి కారణాలతో పశ్చిమ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఛార్జింగ్ చేసుకునే వీలు లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. కేవలం పశ్చిమ మధ్య రైల్వేల్లోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News