: మేనకాగాంధీపై పెట్టిన కేసును వాపసు తీసుకున్న అధికారి


నాలుగు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ను కేంద్ర మంత్రి మేనకాగాంధీ సందర్శించారు. ఈ సందర్భంగా తాను అడిగిన కొన్ని ప్రశ్నలకు అటవీశాఖ అధికారి సరిగా సమాధానం ఇవ్వకపోవడంతో, మేనకాగాంధీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో, ఆమె అటవీ అధికారి చెంప చెళ్ళుమనిపించారు. ఈ ఘటనపై సదరు అధికారి మేనకపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కేంద్రమంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడిన అనంతరం, కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News