: పాక్ వైమానిక దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదుల హతం


పాకిస్థాన్ లోని తూర్పు వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో ఆ దేశ వైమానిక దళం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 17 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాక్ రక్షణ అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై దాడులు జరిపినట్టు చెప్పారు. ఈ దాడుల్లో టెర్రరిస్టుల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పాక్ వాణిజ్య రాజధాని కరాచీలో ఓ బస్సుపై దాడి చేసి 45 మంది అమాయకులను టెర్రరిస్టులు బలిగొన్న నేపథ్యంలోనే వైమానిక దళ దాడులు కొనసాగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News