: రాహుల్ పాదయాత్రలో స్థానికులు ఎవరూ లేరట!
తెలంగాణలో రైతులకు భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రపై టీఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గమైన నిర్మల్ లోని గ్రామాల్లో రాహుల్ పర్యటన కొనసాగుతుండటంతో... ఆయన కొంచెం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, వేలం ద్వారా నిర్మల్ ను ఎంపిక చేశారని ఆరోపించారు. రాహుల్ పాదయాత్రలో స్థానికులు ఎవరూ లేరని... ఇతర జిల్లాల నుంచి తెప్పించిన జనంతోనే పాదయాత్ర కొనసాగిందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదని... కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు.