: అన్నా డీఎంకేలో మారుతున్న పరిణామాలు... 22న ఎమ్మెల్యేలతో జయ కీలక భేటీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఆ పార్టీలో పరిణామాలు మారుతున్నాయి. 'అమ్మ' మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అలంకరించాలని పార్టీ నేతలతో పాటు, పార్టీ కార్యకర్తలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ క్రమంలో, ఈ నెల 22న తన పార్టీ ఎమ్మెల్యేలతో జయలలిత సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశానంతరం, జయ సీఎం పదవిని మళ్లీ చేపట్టబోతున్నట్టు ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం.