: కేసీఆర్ వైఖరితో 100 కోట్లు నష్టం: జీవన్ రెడ్డి
సమ్మె కాలంలో తెలంగాణ ఆర్టీసీ రూ. 100 కోట్లు నష్టపోయిందని... దీనికంతటికీ కారణం టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆరే అంటూ టీకాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని, ఫిట్ మెంట్ ను ముందే ప్రకటించి ఉంటే ఆర్టీసీకి నష్టం కలగకపోయేదని చెప్పారు. కేసీఆర్ వైఖరితో ఆర్టీసీ నష్టపోవడమే కాకుండా, సాధారణ ప్రజానీకం కూడా చాలా ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలిస్తామని గతంలో చెప్పిన కేసీఆర్... ఫిట్ మెంట్ విషయంలో సమ్మె చేసేంతవరకు ఎందుకు నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు.