: పెళ్లాన్ని ఏలుకోలేని మోదీ... దేశాన్ని ఏలుతారా?... లోకేష్, కేటీఆర్ లు చప్రాసీలుగా కూడా పనికిరారు: సీపీఐ నారాయణ
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ, వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కట్టుకున్న పెళ్లాన్ని ఏలుకోలేని మోదీ... దేశాన్ని ఏలగలుగుతారా? అంటూ విరుచుకుపడ్డారు. తన భర్త పిలిస్తే ఆయన వద్దకు వెళతానంటూ మోదీ భార్య చెప్పినప్పటికీ... ఆయన మాత్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. దీనికితోడు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కుమారులైన లోకేష్, కేటీఆర్ లను కూడా నారాయణ టార్గెట్ చేశారు. తెలుగు ముఖ్యమంత్రుల పిల్లలు క్లాసికల్ బెగ్గర్స్ లా అమెరికాలో తిరుగుతున్నారని, వారు చప్రాసీలుగా కూడా పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.