: చైనా ప్రధానితో ముగిసిన మోదీ సమావేశం... 24 ఒప్పందాలపై సంతకాలు


భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన రెండో రోజుకు చేరుకుంది. నిన్నంతా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఆయన సొంత పట్టణంలో బిజీగా గడిపిన మోదీ... నేడు కార్యరంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో చైనా ప్రధాని లీ కెషాంగ్ తో ఆయన భేటీ అయ్యారు. అత్యంత కీలక సమస్య అయిన సరిహద్దు వ్యవహారంతో పాటు భారత్ లో పెట్టుబడులపై మన ప్రధాని చర్చించారు. ఈ సందర్భంగా, రెండు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. రేపు చైనాలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ కానున్నారు. అంతేకాకుండా, చైనాలో ఉన్న భారతీయులను ఉద్దేశించి షాంఘైలో మోదీ ప్రసంగిస్తారు.

  • Loading...

More Telugu News