: కర్నూలులో భగ్గుమన్న ఫ్యాక్షన్... వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడి దారుణ హత్య
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు మరోమారు భగ్గుమన్నాయి. వైసీపీ నేత వసంతరావును ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు. శ్రీశైలం ఎడమ కాలువ పవర్ హౌస్ వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన నేటి ఉదయం వెలుగు చూసింది. వసంతరావు వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ హత్యోదంతం జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.