: తల్లి, భార్య, కూతురును కడతేర్చిన కిరాతకుడు... బాలాపూర్ లో ఘటన


కన్నతల్లి, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డను కడతేర్చాడో దుర్మార్గుడు. నిన్న రాత్రి నిద్రపోయిన ముగ్గురిని ఆ దుర్మార్గుడు అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశాడు. హైదరాబాదులోని బాలాపూర్ పరిధిలోని సాయినగర్ లో ఈ దారుణం వెలుగు చూసింది. సాయినగర్ లో నివాసముంటున్న రాంరెడ్డి అనే వ్యక్తి తన తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కూతురు అక్షయ(14)లను చంపేశాడు. నేటి ఉదయం తెల్లవారగానే వెలుగుచూసిన ఈ ఘటనతో సాయినగర్ లో కలకలం రేగింది. సమాచారమందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News