: రంగారెడ్డి జిల్లాకూ పాకిన ‘ఎర్ర’ నీడలు... మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ మాధవరెడ్డి అరెస్ట్


ఏపీలో రాజకీయ పార్టీలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా, తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకూ పాకింది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత రంగారెడ్డి జిల్లాలోని రావల్ కోల్ లో ఎర్రచందనం అక్రమ రవాణాలో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గా పేరుగాంచిన మాధవరెడ్డి అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రావల్ కోల్ లోని తన ఫాంహౌస్ ను కేంద్రంగా చేసుకున్న మాధవరెడ్డి గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిని నిర్ధారణ చేసుకున్న పోలీసులు వెనువెంటనే స్పందించారు. రావల్ కోల్ చేరుకుని మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ను రూఢీ చేసుకున్న పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News