: కేపీ రావట్లేదు... నిరాశలో ఐపీఎల్ ఫ్యాన్స్!
ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ ఈ ఐపీఎల్ కు రావట్లేదట. నిన్నటికి నిన్న ఐపీఎల్ మ్యాచ్ లకు వస్తున్నానంటూ కేపీ ప్రకటించిన వెంటనే క్రికెట్ అభిమానుల్లో సందడి నెలకొంది. ఒంటిచేత్తో విజయాలు నమోదు చేసే సత్తా ఉన్న కేపీ, ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. సిరీస్ ముగింపు దశకు చేరుతున్న సమయంలో కేపీ రాడని భావించిన అభిమానులకు, ఊహించని రీతిలో 'వచ్చేస్తున్నా'నంటూ ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కేపీ వస్తే హైదరాబాదు జట్టు రాతే మారిపోతుందని క్రికెట్ ఫ్యాన్స్ అంచనాలేశారు. అయితే దగ్గుతో ఇబ్బంది పడుతున్న కేపీ, తాను రాలేనంటూ ప్రకటించాడు. కేవలం 24 గంటల వ్యవధిలో కేపీ నుంచి రెండు రకాల ప్రకటనలు విడుదల కావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.