: మెరుపులు మెరిపించిన పాండ్య...ముంబై 171
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైన చోట వర్ధమాన ఆటగాడు ముంబైని గట్టెక్కించడం విశేషం. ఓపెనర్లు పార్థివ్ పటేల్ (21), సైమన్స్ (14) మంచి ఆరంభం ఇచ్చారు. కానీ దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో క్రీజులోకి వచ్చిన రోహిత్ (30) నిలదొక్కుకుంటున్న తరుణంలో, నరైన్ విసిరిన అద్భుతమైన బంతికి బలయ్యాడు. భారీ షాట్ కు ప్రయత్నించిన రాయుడు (2) విఫలమయ్యాడు. దీంతో పొలార్డ్ (33) కు హార్డిక్ పాండ్య జత కలిశాడు. అప్పటి వరకు అంతంత మాత్రంగా సాగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ కు పాండ్య జెట్ స్పీడ్ తెచ్చాడు. కేవలం 31 బంతుల్లో 61 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో షకిబల్ హసన్ రెండు వికెట్లతో రాణించగా, అతనికి మోర్కెల్, నరైన్ చక్కని సహకారమందించారు. 172 పరుగుల విజయ లక్ష్యంతో కోల్ కతా బ్యాటింగ్ ప్రారంభించనుంది.