: పది ఓవర్లలో 67 పరుగులు చేసిన ముంబై
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై జట్టు పది ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 67 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (21), సైమన్స్ (14) మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ, దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో క్రీజులోకి వచ్చిన రోహిత్ నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమివ్వగా, రాయుడు (2) విఫలమయ్యాడు. దీంతో పొలార్డ్ దిగాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో షకిబ్ అల్ హసన్ రెండు వికెట్లతో రాణించగా, మోర్కెల్ ఒక వికెట్ తీసి సహకారమందించాడు.