: అల్లరి నరేష్ కు 'ప్యాకేజ్ డీల్'లా భలే కుదిరిందిది: తరుణ్
అల్లరి నరేష్ కు ప్యాకేజ్ డీల్ లా 'జేమ్స్ బాండ్, నేను కాదు నా పెళ్లాం' సినిమా కుదిరిందని నటుడు తరుణ్ చెప్పాడు. ఈ సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, మొన్నే నిశ్చితార్థం జరిగిన అల్లరి నరేష్ కు భవిష్యత్ ను సూచించే టైటిల్ తో ప్లాన్డ్ గా ఆడియో వేడుక జరిగిందని అన్నాడు. మరో రెండు వారాల్లో పెళ్లి, ఆ వెంటనే సినిమా విడుదల అంతా ప్యాకేజ్ లా జరుగుతోందని తరుణ్ చెప్పాడు. పెళ్లి తరువాత విడుదలయ్యే తొలి సినిమా ఇదే కనుక విజయం సాధించాలని తరుణ్ ఆకాంక్షించాడు. అల్లరి నరేష్ నటన గురించి చెప్పడానికి ఏమీ మిగల్లేదని, సినిమా అందర్నీ నవ్విస్తుందని తరుణ్ చెప్పాడు.