: సెల్ఫీ పిచ్చి ప్రాణం తీసింది


ఫేస్ బుక్ వ్యసనంగా మారిపోతోంది. సామాజిక మధ్యమాల్లో ఫోటో పెట్టి లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం కొందరికి అలవాటు. రోజుకో రకంగా సెల్ఫీ తీసుకుని పోస్టు చేసి రిజల్టు చూసుకోవడం మరికొందరి అలవాటు. రొమేనియాలోని లాసి పట్టణంలో అన్నా ఉర్సూ (18) అనే యువతి ప్రత్యేక సెల్ఫీ తీసుకోవాలని భావించింది. దీంతో రైల్వేస్టేషన్ కు వెళ్లి ట్రైన్ టాప్ ఎక్కింది. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఆమె కాలికి హైటెన్షన్ వైర్లు తగిలాయి. దీంతో మంటలు వ్యాపించాయి. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను కాపాడేందుకు ఓ ప్రయాణికుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అతను వారిస్తున్నా ఉర్సూ రైలు ఎక్కడం విశేషం. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

  • Loading...

More Telugu News