: నేను నగ్నంగా వస్తా... మీరూ నగ్నంగా రండి: విద్యార్థులకు ప్రొఫెసర్ ఆదేశం


అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్ విభాగంలో ఓ ప్రొఫెసర్ విద్యార్థులను చివరి పరీక్షకు నగ్నంగా రమ్మని ఆదేశించడం వివాదాస్పదమైంది. యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న రికార్డో డొమింగ్వెజ్ తన సబ్జెక్టులో గట్టెక్కాలంటే పరీక్షకు నగ్నంగా రావాలని విద్యార్థులను ఆదేశించాడు. అంతేగాదు, తానూ నగ్నంగా వస్తానని, అరమరికలు లేకుండా అందరం అసలైన వ్యక్తిత్వాలను ఆవిష్కరించుకుందామని తెలిపాడు. దాంతో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. "ఆ ప్రొఫెసర్ కేమైనా పిచ్చా?" అంటూ వారు మండిపడుతున్నారు. ఓ విద్యార్థిని తల్లి దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, యూనివర్శిటీకి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కుమార్తెను వర్శిటీకి పంపబోనని తెగేసి చెప్పింది. ఈ విషయం వినగానే కడుపులో దేవినట్టు అయిపోయిందని తెలిపింది. ఇది తప్పు అని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు ఆమెను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని వివరించింది. దీనిపై, వివాదానికి కారణమైన ప్రొఫెసర్ డొమింగో ఏమంటున్నాడో వినండి. "నేను 11 ఏళ్లుగా ఈ నగ్న తరగతి నిర్వహిస్తున్నాను. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఇది బాడీ ఆర్ట్ కు సంబంధించిన విషయం. ఇదంతా పూర్తి నియంత్రణతో కూడి ఉంటుంది. ఓ డార్క్ రూంలో కొవ్వొత్తుల వెలుగులో నిర్వహిస్తాం" అని వివరించాడు.

  • Loading...

More Telugu News