: కొత్త వాహనం కోసం... పాత వాహనాన్ని వేలం వేస్తున్న అన్నా హజారే


దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా వినుతికెక్కిన అన్నా హజారే కొత్త కారు కొనేందుకు సిద్ధమయ్యారు. అయితే, ముందుగా ఆయన తన పాత కారును వేలం వేయాలని నిర్ణయించారు. హజారే గత ఎనిమిదేళ్లుగా మహీంద్రా స్కార్పియో వాహనాన్ని వినియోగిస్తున్నారు. కొంతకాలంగా, వయసు పైబడిన హజారేను వెన్ను నొప్పి వేధిస్తోంది. దాంతో, ఆయన ఆరోగ్య పరిస్థితికి సరిపడే వాహనం కొనుగోలు చేయాలని హజారే ఏర్పాటు చేసిన ట్రస్టు నిర్ణయించింది. అన్నా స్వగ్రామం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధిలో ఈ వేలాన్ని ఈ నెల 17న నిర్వహిస్తారు. జన్ లోక్ పాల్ ఉద్యమ సమయంలో అన్నా ఈ స్కార్పియో వాహనంలో విస్తృతంగా పర్యటించారు.

  • Loading...

More Telugu News