: రాజధాని భూసేకరణ జీవో విడుదల చేసిన ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నెంబర్ 166 పేరిట ఏపీ భూసేకరణకు జీవో జారీ చేసింది. భూసమీకరణకు ఇష్టపడని వారి భూములను ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హస్తగతం చేసుకోనుంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల నుంచి రేపటి నుంచి భూములు సేకరించనున్నారు.