: 4జీ సేవలు వచ్చేస్తున్నాయోచ్...
స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ ను మరింత పెంచే 4జీ సేవలను ఎయిర్ టెల్ ఈరోజు చెన్నైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అంతేకాకుండా, ఈ నెలాఖరు నుంచి ముంబై, హైదరాబాదుల్లో 4జీ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ రెండు నగరాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపింది. ఇప్పటికే బెంగళూరు, చండీఘడ్, పూణె, కోల్ కతా తదితర 19 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని... ఈ ఏడాది చివరికల్లా 4జీ సేవలను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలకు కూడా విస్తరింపజేస్తామని వెల్లడించింది.