: ట్రైన్ లో 82 లక్షలు దోచేశారు
నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. బంగారం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు నెల్లూరు జిల్లా కావలి నుంచి నెల్లూరు ప్రధాన పట్టణానికి నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో వెళ్తుండగా ఆగంతుకులు పోలీసులమని చెప్పి 82 లక్షల రూపాయలు దోచుకుపోయారు. దీంతో లబోదిబో మంటూ వ్యాపారులు కావలి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.