: "సూపర్ వదినా"... కోహ్లీ ప్రేయసి పోస్టుపై యువీ కామెంట్

టీమిండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజా చిత్రం 'బాంబే వెల్వెట్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలతో అనుష్క బిజీగా ఉంది. తాజాగా, ఆ సినిమాలో తన పాత్ర 'రోజీ నరోన్హా' చిత్రాలను "మెనీ మూడ్స్ ఆఫ్ రోజీ" అంటూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పోస్టుపై ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఆ ఫొటోలను లైక్ చేయడమే కాకుండా, "ఓయే హోయే రోజీ భాభీ! లుకింగ్ ఆసమ్!" అంటూ అనుష్క టైమ్ లైన్ లో కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా అనుష్కను యువీ 'వదిన' అని సంబోధించడం విశేషం.